ఇవాల నాకు ఉరిశిక్ష పడింది, దానికి కారణం నా తల్లిదండ్రులు.
అవును నిర్భయను రేప్ చేసింది నేనే, కాని నన్ను అలా చేయమని చెప్పింది ఇప్పుడు నన్ను తిట్టుకుంటున్న ఈ ప్రజలే.
బహుషా అందుకేనేమో నిర్భయ అర్ధరాత్రి ఎలాంటి రక్షణ లేకుండా కనిపించినప్పుడు....
ఆమె నాకంటే బలవంతురాలు కాకపోయినా కూడా నాలా సమానమైన హక్కులు కల్గిన మనిషే అని నేను ఆలోచించలేకపోయాను.
ఓ తల్లిదండ్రులారా! ఉపాధ్యాయులారా! ప్రజలారా! మీరు అనాగరికత, పురుషాధిపత్య భావజాలన , రక రకాల కుల, మత పరమైన మూఢ విశ్వాసాలు, ఆచారలు, సంస్కృతి పేరుతో నాకు నేర్పించి నిర్భయను రేప్ చేసేలా ప్రేరేపించారు. ఇప్పుడు నాదే తప్పు అని నాకు మీరందరు కలిసి ఉరి శిక్ష వేయించారు. నన్ను చంపే అధికారం మీకు ఎక్కడిది? అసలు ఒక మనిషి మరో మనిషిని చంపటం ఏంటి?
ఇది హత్య కాదా?
మీరు కాదా మొదట మారాల్సింది?
అలా మారనప్పుడు మీరు కాదా మొదట ఉరి వెసుకొని చావాల్సింది?
కనీసం మీలాంటి వారు చస్తే ఓ మంచి సమాజం నిలుస్తుంది. అలాంటి మంచి సమాజం వల్ల ఒక గొప్ప విలువలు గల ప్రపంచం ఏర్పడుతుంది.
NOTE: సమాజంలో ఒక మనిషి తప్పు చేసాడంటే దానికి పరోక్షంగా తల్లిదండ్రులు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, స్నేహితులు, ఆఖరికి ప్రజలు కూడా భాద్యత వహించాలే తప్ప ఉరి తీసి చేతులు దులుపుకుంటే సమస్యకు పరిస్కారం కాదు అని నా భావన. అలా ఓ కోణంలో ఆలోచించి ఈ వ్యాసం రాసానే తప్ప, ఇదే నా అంతిమ తీర్పు, ఉద్దేశం కాదు.
త్వరలో నన్ను ఉరి తీసి చంపేస్తారు, దానికి కారణం నాకు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు.
అవును నిర్భయను రేప్ చేసింది నేనే, కాని నన్ను అలా చేయమని చెప్పింది ఇప్పుడు నన్ను తిట్టుకుంటున్న ఈ ప్రజలే.
- నేను పుట్టకముందే ఆడపిల్ల వద్దు మొగపిల్లాడే కావాలి అని మీరు దుర్బుద్దితో కోరుకున్నప్పుడే, ఆడపిల్లల పట్ల వంచన మీలో మొదలైంది. ఇక మీరెలా పిల్లల్ని సమానత్వంగా పెంచగలరు.
- నేను పుట్టినాక సంస్కృతి పేరుతో మీరు చూపించే వివక్ష- నాకో రకమైన బట్టలు అక్కకో రకమైన బట్టలు. అది ఎంతలా మా మెదడులను మార్చేసిందంటే ఆడవాళ్ళు ప్యాంటు, షర్టు వేసుకుంటే అదేదో అపచారం చేస్తున్నట్టు.
- నన్ను స్వేచ్చగా ఆడుకోడానికి బయటికి వెళ్ళనిచ్చినట్టుగా ఏనాడైనా అక్కను వెళ్ళనిచ్చారా?
- ప్రపంచం మొత్తం మీద భార్యా భర్తల మద్య అదో భాద్యతల ఒప్పందమో ఏమో నాకు అర్దం కాదు. ఇంట్లో అమ్మానాన్నా ఇద్దరూ జాబ్ చేస్తూ సంపాదిస్తున్నా కూడా, వంట చేయటం, వాకిలి ఊడ్చి అలుకు చల్లటం, బట్టలు ఉతకటం, ఇలాంటి కొన్ని ఇంటి పనులు అమ్మనే ఎందుకు చేస్తుంది? అసలు నాన్న ఎందుకు వెనుకడుగు వేస్తాడు? మీ ఇద్దరిలోని పనుల వ్యత్యాసం మేమూ నేర్చుకుంటామని మీకు తెలీదా? మీరు మాత్రమే కాక నాకు, అక్కకు అలాగే పనులు చెప్తారు. అక్కకు వంట, ఇంటి పనులు చెప్పి నాకు ఎందుకు చెప్పరు?
- పెద్దమనిషి అయిందని ఫంక్షన్ చేసి అక్కని అంగడి సరుకులాగా ప్రదర్షించలేదా? అంటే మీ ఉద్దేశం ఏంటి? తను పిల్లలను కనటానికి రెడీగా ఉంది వచ్చి పెళ్ళి అనే లైసెన్సు పొంది రేప్ చేసి పిల్లలని పొందవచ్చు అని సిగ్గు లేకుండా చెప్తున్నారా? ఇలా మీరు మతం, సాంప్రదాయం పేరుతో చేసే పైశాచికాన్ని చూసి మేము నేర్చుకోమా?
- ఇలా రేప్ చేయటానికి పొందే పెళ్ళి అనే లైసెన్సు కోసం, చూపులు కూడా అవుతాయ్. అదే పెళ్ళి చూపులు . ఇక అమ్మాయికి ప్రపంచంలోని అత్యంత కష్టమైన ఇంటర్వ్యూ. అమ్మాయి అనిగి మరీ ఉండాలి, ఆధిపత్యం (dominate) చెయకూడదు అని ఎందుకు అన్ని ఆంక్షలు, ప్రశ్నలు? ఏనాడైనా ఇద్దరూ సమానమే అని హితం నేర్పుతూ, ఒకరినొకరు వంచింపకుండా అర్దం చేసుకొని ఉండాలి అని పెళ్ళి చేసారా?
- బడిలో మాకు పాఠాలు కూడా అలాంటివే. "రాము చక్కగా తన homework చేసుకొని స్నేహితులతో ఆడుకోటానికి వెల్లాడు. తండ్రి కుర్చీలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అక్క చురుగ్గా తల్లి వంట పనుల్లో సహాయంగా కూరగాయలు కోసి పెడుతోంది". మొదటి నుంచి మాకు పుస్తకాలు, ఉపాధ్యాయులు ఇలాంటి పాఠాలు నేర్పిస్తే ఆడవాల్లు ఇంటి పనులకే అని మా మెదడులో ఇమిడి వాళ్ళకే తెలీకుండా పెత్తనం చేయమా? వాళ్ళకు ఇక జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు మనుషులు కారా? వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండద్దా?
- బడిలో ఉపాధ్యాయులు బాద్యతగా మాకు విలువైన పాఠాలు నేర్పాలిగా! మరి అదేంటి పుస్తకాలల్లో ఉన్నది మాత్రమే చెప్పి వెళ్ళిపోతారు. మేమైనా యంత్రాలమా? రేపు మేము సమాజంలో తిరుగుతాం, మీరు విలువలు, బాధ్యతలు నేర్పరా? తల్లిదండ్రుల తర్వాత మీరేగా!
- మగవాడూ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆశ్చర్యపోరు, అదే ఆడది ఒక్క పరాయి మగాడితో దెగ్గరిగా మాట్లాడితే, బరి తెగించింది అంటారు. అంటే ఆడవాళ్ళకే శీలం ఉంటుందా? మగవాళ్ళకు సిగ్గు, సంస్కారాలు ఉండవా?
- సమాజంలో సినిమాలు కూడా ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయ్. స్త్రీలను తక్కువగా చేసి, వ్యంగ్యాన్ని హాస్యంగా వక్రీకరించి చూపిస్తున్నారు. వాటిని మాలాంటి వాళ్ళు యువత చూసి హిట్ట్ అయ్యేట్టు కూడా చేసాం. మాకు ఎలా తెలుస్తుంది ఆ సినిమాలు తప్పుగా చూపిస్తున్నాయని. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పుని తప్పు అని ఎప్పుడూ చెప్పలేదు, విలువలూ నేర్పలేదు, ఇప్పుడు మమ్మల్ని ఎలా నిందిస్తారు.