ఒక మహిళ అత్యాచారానికి గురైంది. అది కచ్చితంగా హింసతో కూడుకున్న ఒక భయంకరమైన నేరమే.
నిజానికి ఒకరి ఇష్టానికి వ్యతిరేకంగా హింసించి చేసే పెద్ద నేరాలు అత్యాచారాలు మరియు హత్యలు కూడా. కానీ మనం హత్య కంటే అత్యాచారానికి ఎక్కువ రియాక్ట్ అవుతాం, వాడిని చంపేయండి, కాళ్ళు చేతులు నరికేయండి అని. అత్యాచారాలు అన్ని ఎక్కువగా ఆడవాళ్ల పై జరిగే నేరాలే, మరి హత్యలు అలా కాదు. So, ఒక హత్య అత్యాచారం కంటే చిన్న నెరమైతే కాదు అని నేను అనుకుంటున్నా.
సరే ఎదో ఒక నెరమైతే ఎక్కడో జరిగింది, ఇంతకీ నా సందేహాలు ఏంటంటే, ఒక నేరానికి ముఖ్యంగా అత్యాచారానికి....
-మరణశిక్ష న్యాయం ఎలా అవుతుంది? అసలు మరణ శిక్ష పెద్ద శిక్ష ఎలా అవుతుంది? నీపై హింస చేసినవాడిని నువ్వు కూడా హింసిస్తే నీకు న్యాయం జరిగినట్టా? కానప్పుడు బాధితురాలికి న్యాయం జరగటం అంటే ఏంటి? ఎలా చేస్తాం? అసలు అత్యాచార నేరానికి న్యాయం అంటు ఉంటుందా?
-అత్యాచారం తన ఇష్టానికి వ్యతిరేకంగా తన పై జరిగిన ఒక హింసాత్వక చర్య కదా, స్వేచ్ఛ కదా ఎవరైనా కోరుకునేది. మరి శిక్షలు మనకు స్వేచ్చని ఇవ్వగలవా? స్వేచ్చ కొరకు జరిగే మార్పు కదా మనకు కావాలి మరి అది ఎలా సాధ్యం?
-నేరస్తులకు శిక్ష పడనప్పుడు భాదితుల తరపున పోరాడుతాము కదా, మరి ఇకపై నేరాలు జరగకుండా కూడా పోరాడాలి కదా?
-మరి మరణశిక్షలు ఇక పై అత్యాచారాలు/నేరాలు జరగకుండా ఆపగలవా? లేనప్పుడు మరి ఎలా ఆపగలం?
నేను మరణశిక్షలు/కాళ్ళు చేతులు నరికేయటం లాంటి శిక్షలకు వ్యతిరేకం. అవి మనిషిలో మార్పు తేగలవు అని నేను అనుకోను అలాంటి దాఖలాలు ఎక్కడా లేవు కూడా. మనిషి నేరం చేసే సమయంలో అవన్నీ ఆలోచించడు అని మనకు ఒక సర్వే లో చెబుతున్నారు, వివిధ దేశాల శిక్షా వ్యవస్థలను చూడొచ్చు. మనిషి నేరం చేయకుండా భయపడతాడు అని చాలా మంది అంటారు కానీ అది మార్పు కానే కాదు. అది తాత్కాలికం మాత్రమే. మనం ఎవరికైనా భయం ఎందుకు నేర్పాలి? మహిళలు మాత్రమే కాదు, ఏ మనిషైనా స్వేచ్ఛగా సమాజంలో నేరానికి పాల్పడకుండా ఉండటం మనకు కావాలి. నీ కూతురే కాదు, నీ కొడుకు కూడా స్వేచ్చగా తిరగగలగాలి కదా? అలాంటి మార్పు ఆలోచనా విధానం మార్చి కదా మార్పును తేగలం.
మరి ఎం చేస్తే బాగుంటుంది?
1. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు పిల్లలకి ముఖ్యంగా male childకి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం. అవగాహన చాలా విషయాల్లో కావాలి, అందరికి కావాలి. మానవ హక్కుల పై కావాలి. మధ్యం, డ్రగ్స్ వల్ల మనిషి తన కంట్రోల్ తప్పుతాడు అని తాను తెలుసుకోవాలి. అసలు మనిషి ఎలాంటి పరిస్తుతుల్లో నేరానికి పాల్పడుతాడు అనే అవగాహన ఉండాలి.
2. 100% క్రైమ్ జరగని సమాజం వస్తుందని నేనైతే అనుకోను. రాత్రి ఎవరు లేని ప్రదేశంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు ఆడవాళ్లే కాదు, నేను ఉన్నా భయపడతా. కానీ నా పై రేప్ జరగక పోవచ్చు, attack అయితే జరగొచ్చు. So, క్రైమ్ situations ని ముందుగా పసిగట్టగలగటం తెలుసుకోవాలి మరియు జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి ఎవరు లేని ప్రదేశానికి నువ్వు ఎందుకు వెళ్లావు అని నేను అడగను, కానీ అలా వెళ్ళాల్సిన పరిస్థితి నాకు వస్తే నేనైతే జాగ్రత్తలు తీసుకుంటా, నా అక్కనైతే నేను వెళ్లద్దనే చెప్తా.
3. Policing వ్యవస్థ ఎప్పుడూ బలపరుస్తూ ఉండాలి.
Note: ఈ post శిక్షలపై ఎక్కువగా అత్యుత్సాహం చూపి మార్పు కొరకు ఆలోచించని వారిని ఉద్దేశించి రాసింది.
నేరస్తుడ్ని శిక్ష పడే విషయం పై మనం ఆవేశ పడతాం, పోలీసింగ్ వ్యవస్థ మెరుగు పడాలి అనుకుంటాం. సరైన పోలీసింగ్ వ్యవస్థ ఉండాలి, నేరస్తుడికి శిక్ష ఉండాలి కానీ, ఇకపై ఆ నేరాలు ఎలా ఆపగలం అని కదా మనం ముఖ్యంగా ఆలోచించి educate చేయాలి అని నా ఉద్దేశం.
Image Source: https://slideplayer.com/slide/7108963/
0 comments:
Post a Comment