నాకు అందుకే 'నేను', 'నాది' కంటే 'మనము', 'మనది' అంటేనే ఇష్టం.
# నాది, నా దేశం మాత్రమే గొప్పది. దేశ హద్దుల దెగ్గర యుద్ధాలు. ఇంకేముంది చైనా, పాకిస్తాన్ మనుషులు మనలాగే మనుషులు అని అనుకోము.
# నా మతం మాత్రమే గొప్పది. రాజకీయనాయకులు మత విద్వేషాలు పుట్టిస్తారు, మనం కొట్టుకు ఛస్తాం. అవతలి మతం వాడు మనలాంటి మనుషులే అని అనుకోము.
# నా కులం మాత్రమే గొప్పది. ఎంతటి పెద్ద సంఘసంస్కర్త అయినా కులాన్ని మాత్రం వదలడు. అదేం గొప్పో నాకు అర్థం కాదు. నేను కులాంతర వివాహం చేసుకున్నా అని కూడా చెప్పడం ఎందుకు? కులాల ప్రస్తావన తెచ్చినంత కాలం కులం పోదు కదా? అవతలి కులం వాడిని మనలాగే మనిషి అని మరిచి ఎక్కడో చిన్న వ్యత్యాసం మొదలవుతునే ఉంటుంది కదా?
నా దేశమే గొప్పది, నా భాషే గొప్పది, నా మతమే గొప్పది, నా కులమే గొప్పది....ఎవడికి వాడిదే గొప్పది. అవసరమా?
ఈ వర్గాలు అన్ని మర్చిపోయి ఒకసారి అందరం మనుషులే అని ఆలోచించి చూడు, ఎంత బాగుంటుందో. నువ్వే మొదలుపెట్టాలి, ఎదుటి వాడిని నిందించనవసరం లేదు, నిన్ను చూసి అవతలి వాడు కూడా మారతాడు.
0 comments:
Post a Comment