ఎన్నో inspirations, మరెన్నో జ్ఞాపకాలు...

అది 2006, Feb 17.  అదే చివరి సారిగా నాన్నని చూసిన రోజు అవుతుందని అనుకోలేదు.
నేను ఇంటికి కాస్త దూరంగా hostel లో ఉండి చదువుకుంటున్న రోజులు అవి.

2006 March 17 నాన్న మరణించిన రోజు.  నేను ఇంటికి వచ్చేవరకు late అవుతుందని, bodyని iceపై ఉంచారు. Cornea మాత్రం త్వరగా తీసేయాలి కాబట్టి, నేను వచ్చేవరకే తీసేసి cotton band కట్టారు. అది చూసి కాస్త బాధగా అనిపించినా లోపల చాలా గర్వంగా feel అయ్యా. ఆ తర్వాతి రోజు bodyని Kakatiya Medical College, Warangal కి donate చేయటం జరిగింది.

మా ఇంట్లో నాకు తెలిసి body donation, organ donation గురుంచి బలమైన చర్చలు ఎప్పుడూ జరగలేదు. అయినా కొంత కుటుంబంలో వ్యతిరేకత వచ్చినా, ఆ సమయంలో అమ్మ తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ నాకు చాలా గర్వంగా ఉంటుంది.

నాన్నని inspiration గా తీసుకొని మా పెద్దనాన్న (నాన్న అన్నయ్య) Sadashaya Foundation స్థాపించారు. ఇప్పటికీ చాలా awareness  ప్రోగ్రామ్స్  చేస్తూనే ఉంటారు. ఆయన కృషికి  అనేక అవార్డులు కూడా అందుకున్నారు.

Feb 17న గాని, March 17న గాని  నాన్న గుర్తుకు వస్తారో లేదో నాకు తెలీదు కానీ, అవయవ దానం గురుంచి ఎక్కడ ఏ వార్త చూసినా ఖచ్చితంగా గుర్తుకు వస్తారు.

ఈ రోజు World Organ Donation Day సందర్భాన ఇలాంటి మరెందరో మహానుభావుల మధ్య నేను ఎన్నో inspirationsతో, మరెన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ......

                                       
                                                                                                                                       .....మీ నిశాంత్. 
Share on Google Plus

About perspectrix

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.