అంతే మరి నువ్వు ఫెమినిస్టువి కాకపోతె ఎంత చదువుకున్నా, సంపాదించినా ఏం లాభం. పశువుకి నీకు తేడా ఉండాలిగా. మన సమాజంలో ఒక రోగం ఉంది అదే, నేను మగవాడ్ని అని మగవాడు తన గర్వాన్ని ప్రదర్షించే తత్వం. దురదృష్టమేమిటంటే పితృస్వామ్యపరిపాలన ఫలాన ఈ రోగం ప్రతి మగవానిలో ఏదో ఒక సమయంలో ఎంత వద్దనుకున్నా బయటపడుతుంది. ఇక ఇలాంటి రోగం గురుంచి తెలియని వారి సంగతి చెప్పనక్కర్లేదు. ఒక్కటి మాత్రం ఖచ్చితం, ఏదైనా మీ పిల్లలకు నేర్పాలంటే అది మొదలు మీ ఇంటి నుంచే మొదలవాలి. మీరు పాటిస్తేనే మీ పిల్లలు పాటిస్తారు. ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.