భూమి పైన జీవిస్తున్న ప్రతి మనిషిలోనూ స్వార్ధం ఉంటుందని, ఈ స్వార్ధం అడుగడుగునా తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందనేది నేను నమ్ముతున్న ఓ సిద్ధాంతం. అయితే అది మంచిదా, చెడుదా అనేది ముఖ్యం. మనిషి పీల్చుకునే ఆక్సీజన్ తో పోల్చితే అది మంచిదైతే పర్లేదు, కాని అది చెడు ఆక్సీజన్ అయితే ప్రాణానికే ప్రమాదం. స్వార్ధం కూడా అలాంటిదే.ఉదాహరణకు...
మీరు సంపాదించిన పది రూపాయలలో, ఒక్క రూపాయి దారిన పోయే బిచ్చవానికి ఇచ్చి అందులో సంతోషపడతారు. ఇలా మీ సంతోషం కోసం మీకు తెలీకుండానే స్వార్ధం ప్రదర్శిస్తారు. ఈ స్వార్ధం మంచిదే. కాని ఇక్కడ ఇంకో కోణం ఉంది. అదే పది రూపాయలు అంతా నాకే, అంతా నాది అనుకుంటే వెర్రి తనం అవుతుంది. ఎందుకంటే క్రమంగా తోటి మనుషులను నమ్మకపోగా నా అనుకున్న వారు దూరం అవుతారు, ఆప్తులు కూడా బధ్ధ శత్రువుల్లా కనిపిస్తారు.
ఎప్పటికైనా నేను, నాది కన్నా మనము, మనది అంటేనే బాగుంటుంది.
0 comments:
Post a Comment